Annadanam: ఏపీలోని ఆలయాల్లో అన్నదానం బదులు ఆహారం ప్యాకెట్లు!

  • కరోనా పెరుగుతుండటంతో కీలక నిర్ణయం
  • అన్నదానం బదులు భోజనం ప్యాకెట్లు ఇవ్వాలని నిర్ణయం
  • భోజనం ప్యాకెట్లో సాంబారు అన్నం, దద్దోజనం
Annadanam stopped in various temples in AP

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాల్లో అన్నదానం కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు దేవాదాయశాఖ ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాల్లో కూడా అన్నదానాన్ని నిలిపివేస్తున్నారు. అయితే, అన్నదానం ఆగిపోయిన ఆలయాల్లో భక్తులకు మరో రూపంలో భోజనం అందజేయనున్నారు. భోజనం ప్యాకెట్లను ఇవ్వనున్నారు. ఈ ప్యాకెట్లో సాంబారు అన్నం, దద్దోజనం ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తారు.

More Telugu News