Rashmika Mandanna: త్రివిక్రమ్ సినిమాలో రష్మిక ఖరారు?

Rashmika in Trivikram Srinivas movie
  • తెలుగు, హిందీ సినిమాలతో రష్మిక బిజీ 
  • లక్నోలో మిషన్ మజ్ను షూటింగ్ పూర్తి
  • ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తాజా ప్రాజక్ట్   
  • నిన్న త్రివిక్రమ్ ని కలసిన ముద్దుగుమ్మ 
ఇప్పటికే తెలుగులో 'పుష్ప', 'ఆడాళ్లూ మీకు జోహార్లు' సినిమాలలో నటిస్తున్న కన్నడ భామ రష్మిక.. మరోపక్క అటు హిందీ సినిమాలలో కూడా నటిస్తూ తెగ బిజీగా వుంది. ప్రస్తుతం, హిందీలో 'మిషన్ మజ్ను', 'గుడ్ బాయ్' చిత్రాలలో నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ సరసన నటించే బిగ్ ఆఫర్ ను సైతం అందుకున్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్టు పని కూడా పూర్తయింది. ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో కథానాయికగా ఇప్పటివరకు పూజ హెగ్డే, జాన్వీ కపూర్ వంటి భామల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా ఆ అవకాశం రష్మికకు వెళ్లినట్టు తెలుస్తోంది.

రష్మిక ఇటీవల కొన్ని రోజుల పాటు మిషన్ మజ్ను కోసం లక్నోలో షూటింగ్ చేసింది. అక్కడి షూటింగును పూర్తిచేసుకుని తాజాగా హైదరాబాదుకు చేరుకున్న రష్మిక నిన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కలిసినట్టు చెబుతున్నారు. ఈ సినిమా విషయంపై చర్చించడానికే ఆమె ఆయనను కలిసినట్టు సమాచారం. ఆమె ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది.  
Rashmika Mandanna
NTR
Trivikram Srinivas
Pooja Hegde

More Telugu News