Oravax: మాత్ర రూపంలో రానున్న కరోనా వ్యాక్సిన్​!

  • నోటి ద్వారా వేసుకునే తొలి కరోనా టీకా ‘ఓరవ్యాక్స్’
  • రూపకల్పన చేసిన భారత సంస్థ ప్రేమాస్ బయోటెక్
  • జంతువులపై పరిశోధనల్లో సత్ఫలితాలు
  • త్వరలోనే మనుషులపై క్లినికల్ ట్రయల్స్
Now Indian pharma firm develops oral vaccine in capsule form for Covid19

ఇప్పటిదాకా కరోనా వ్యాక్సిన్లు ఇంజెక్షన్ల రూపంలోనే అందుబాటులోకి వచ్చాయి. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ పై భారత్ బయోటెక్ పరిశోధనలు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ఒక్క కరోనా వ్యాక్సినే కాదు.. పోలియో వ్యాక్సిన్ తప్ప దాదాపు టీకాలన్నీ ఇంజెక్షన్ల రూపంలోనే ఉంటాయి.. అలాంటివే ఉన్నాయి కూడా. అయితే, తొలిసారిగా నోటి ద్వారా.. మాత్ర రూపంలో తీసుకునే కరోనా వ్యాక్సిన్ పై ‘ప్రేమాస్ బయోటెక్’ అనే మరో భారత సంస్థ పనిచేస్తోంది. అమెరికా సంస్థ ఓరామెడ్ ఫార్మాస్యుటికల్స్ ఐఎన్ సీతో కలిసి దానిపై పరిశోధనలు చేస్తోంది.

‘ఓరవ్యాక్స్’ అనే కొవిడ్ 19 వ్యాక్సిన్ ను క్యాప్సూల్ రూపంలో తయారు చేసింది. జంతువులపై పరిశోధనలు కూడా చేసింది. ఆ ప్రాథమిక పరీక్షల్లో వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేసినట్టు ఈ నెల 19న సంస్థ ప్రకటించింది. కరోనా వైరస్ సోకకుండా అడ్డుకునే ఐజీఏ, ఐజీజీ యాంటీ బాడీలను (ప్రతి రక్షకాలు) నోటి ద్వారా తీసుకునే ఈ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలిగిందని చెప్పింది. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.

ఎలా తయారు చేశారు?

ప్రేమాస్ బయోటెక్ సంస్థ ప్రొటీన్ ఆధారిత వీఎల్ పీ పద్ధతిలో ఓరవ్యాక్స్ ను తయారు చేసింది. అంటే ప్రొటీన్ తో వైరస్ లాంటి పార్టికల్ కు రూపకల్పన చేసింది. కరోనా వైరస్ లోని స్పైక్ ప్రొటీన్ ఎస్, మెంబ్రేన్ ఎం, ఎన్వలప్ ఈని లక్ష్యంగా చేసుకుని పనిచేసేలా ఈ క్యాప్సూల్ వ్యాక్సిన్ ను రూపొందించింది. డాక్టర్ ప్రబుద్ధ కుందు ప్రేమాస్ బయోటెక్ కు సహవ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రేమాస్ పేటెంట్ పొందిన డీ క్రిప్ట్ ప్లాట్ ఫాం ద్వారా వ్యాక్సిన్ వీఎల్ పీలను తయారు చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ కు అవసరమయ్యే ఓరల్ ప్రొటీన్ ను ఓరామెడ్ అనే సంస్థ తన పీవోడీ ప్లాట్ ఫాం ద్వారా అభివృద్ధి చేస్తోంది.  

More Telugu News