ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్, రిలయన్స్ ఒప్పందం కేసులో అమెజాన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
- రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య ఒప్పందం
- ఒప్పందం విలువ రూ.24,713 కోట్లు
- సింగపూర్ ఆర్బిట్రేషన్ ఆదేశాలకు వ్యతిరేకమంటున్న అమెజాన్
- ఒప్పందం అంశంలో ముందుకెళ్లొద్దన్న ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్
- ప్యూచర్ గ్రూప్ కు ఆదేశాలు
- డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన ఫ్యూచర్ గ్రూప్
వాదోపవాదాలు విన్న మీదట సింగిల్ బెంచ్ ఇచ్చిన ఒప్పందం నిలుపుదల ఆదేశాలపై చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్ లతో కూడిన బెంచ్ స్టే ఇచ్చింది. ఈ ఒప్పందం పట్ల అభ్యంతరాలేంటో చెప్పాలని అమెజాన్ కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది.
అంతేకాదు, ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ తదితరుల ఆస్తులను అటాచ్ చేయాలన్న ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలపైనా ధర్మాసనం స్టే ఇచ్చింది. వారిని ఏప్రిల్ 28న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.