Uddhav Thackeray: ఉద్ధవ్ థాకరే, అనిల్ దేశ్ ముఖ్ లకు నార్కో పరీక్షలు నిర్వహించాలి: బీజేపీ నేత రామ్ కదమ్ డిమాండ్

BJP demands narco test of Uddhav Thackeray and Anil Deshmukh
  • మహారాష్ట్రను కుదిపేస్తున్న అక్రమ వసూళ్ల ఆరోపణలు
  • నెలకు రూ. 100 కోట్ల వసూళ్లు 
  • వాజేకు అనిల్ అనధికార టార్గెట్ ఇచ్చారన్న పరంబీర్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ లు నార్కో పరీక్షలను చేయించుకోవాలని ఆ రాష్ట్ర బీజేపీ నేత రామ్ కదమ్ డిమాండ్ చేశారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్లు, ఇతర సంస్థల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేసి తనకు ఇవ్వాలని సచిన్ వాజేకు అనిల్ దేశ్ ముఖ్ అనధికార టార్గెట్ నిర్దేశించారని మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పార్లమెంటులో సైతం ఈ అంశంపై రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్ కదమ్ మాట్లాడుతూ, థాకరే, అనిల్ ఇద్దరూ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్ధవ్ నాయకత్వంలో మహారాష్ట్ర, ముంబై పోలీసుల పరువు పోయిందని అనిల్ మండిపడ్డారు. ఇంత దారుణమైన నేరం స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ జరగలేదని అన్నారు. ఇదంతా ఉద్ధవ్ కు తెలిసే జరిగిందని ఆరోపించారు. వాజే గ్యాంగ్ కు ముఖ్యమంత్రి సహకరిస్తున్నారనే విషయం భారత్ తో పాటు యావత్ ప్రపంచానికి తెలుసని అన్నారు. ఈరోజు ముంబై కమిషనర్ ను కలుస్తానని చెప్పారు.

నెలకు రూ. 100 కోట్ల లెక్కన ఉద్ధవ్ పాలనలో ముంబైలో ఇప్పటి వరకు రూ. 1500 కోట్ల అక్రమ వసూళ్లు జరిగాయని మరో బీజేపీ నేత కిరీట్ సోమయ ఆరోపించారు. సీఎంఓ కార్యాలయ అధికారులతో పాటు సచిన్ వాజే, సంజయ్ పాటిల్, పరమ్ బీర్ సింగ్ లను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. మరోవైపు అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేస్తున్నారనే వార్తలను ఎన్సీపీ కొట్టివేసింది.
Uddhav Thackeray
Anil Deshmukh
Shiv Sena
Ram Kadam
BJP

More Telugu News