Modi: బీజేపీ స్కీములు తెస్తుంటే, తృణమూల్‌ స్కాములు చేస్తోంది: బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

  • బెంగాల్‌లో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం
  • నేడు బంకురాలో మోదీ పర్యటన
  • దీదీపై ఘాటు విమర్శలు
  • బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిని అంతం చేస్తామని హామీ
modi criticised didi in bengal rally once again

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం రోజురోజుకీ వేడెక్కుతోంది. అధికార తృణమూల్‌, విపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని బంకురా ప్రాంతంలో పర్యటించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో అక్కడక్కడా గోడలపై తనని కించపరిచేలా చిత్రాలు గీశారని మోదీ తెలిపారు. ఇది మమత పనేనని పరోక్షంగా ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల బెంగాల్‌ సంస్కృతి, సంప్రదాయాలను దీదీ అవమానిస్తున్నారని విమర్శించారు. బెంగాల్‌ ప్రజల కలలు, ఆశల్ని మాత్రం మమత ఛిద్రం చేయలేరని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ కేంద్ర పథకాలు బెంగాల్‌ ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని మోదీ ఆరోపించారు. అలాగే దీదీ సర్కార్‌ పూర్తిగా అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయిందని విమర్శించారు.  బీజేపీ స్కీములు(పథకాలు) తెస్తుంటే .. తృణమూల్‌ స్కాములు(కుంభకోణాలు) చేస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిని అంతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్న ఆయుష్మాన్ భారత్‌, కిసాన్‌ సమ్మాన్‌ నిధి, జల్‌ జీవన్‌ మిషన్‌ వంటి ప్రతిష్ఠాత్మక కేంద్ర పథకాల్ని ప్రజలకు చేరువ చేస్తామని హామీ ఇచ్చారు. దీదీని ప్రశ్నిస్తున్న కొద్దీ ఆమెకు ఆగ్రహం పెరిగిపోతోందని మోదీ అన్నారు.

More Telugu News