England: టీమిండియాతో వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు ఎంపిక... గాయంతో ఆర్చర్ దూరం

  • భారత్, ఇంగ్లండ్ మధ్య 3 వన్డేలు
  • ఈ నెల 23న తొలి మ్యాచ్
  • 14 మందితో ఇంగ్లండ్ జట్టు ప్రకటన
  • మోచేతి గాయంతో బాధపడుతున్న ఆర్చర్
England picked squad for ODIs against India

టీమిండియాతో జరిగే 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. ఈ సిరీస్ మార్చి 23న ప్రారంభం కానుంది. అయితే మోచేతి గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఈ సిరీస్ కు దూరం అయ్యాడు. చికిత్స కోసం ఆర్చర్ ఇంగ్లండ్ పయనం కానున్నాడు. ఇక బ్యాకప్ ప్లేయర్లుగా జేక్ బిల్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ మలాన్ కూడా ఇంగ్లండ్ జట్టు వెంట ఉండనున్నారు. కాగా, టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ కు పుణే ఆతిథ్యమిస్తోంది.

వన్డే సిరీస్ లో పాల్గొనే ఇంగ్లండ్ జట్టు సభ్యుల వివరాలు ఇవిగో...

ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో,  జోస్ బట్లర్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, శామ్ బిల్లింగ్స్, శామ్ కరన్, టామ్ కరన్, లియామ్ లివింగ్ స్టన్, మాట్ పార్కిన్సన్, అదిల్ రషీద్, రీస్ టాప్లే, మార్క్ ఉడ్.

More Telugu News