Ajay Lalwani: పాకిస్థాన్ లో దారుణం.. బార్బర్ షాపుకు వెళ్లిన హిందూ జర్నలిస్టు కాల్చివేత
- సింధ్ ప్రావిన్స్ లోని సుక్కూర్ లో ఘటన
- వాహనాల్లో వచ్చిన దుండగులు
- జర్నలిస్టుపై విచక్షణ రహితంగా కాల్పులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన జర్నలిస్టు
పాకిస్థాన్ లో ఓ హిందూ జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ పాత్రికేయుడి పేరు అజయ్ లాల్వానీ. వయసు 31 సంవత్సరాలు. 'పుచానో' అనే ఉర్దూ దినపత్రికలో అజయ్ లాల్వానీ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. సింధ్ ప్రావిన్స్ లోని సుక్కూర్ పట్టణంలో ఆయనను దుండుగులు కాల్చి చంపారు. క్షవరం చేయించుకునేందుకు ఓ బార్బర్ షాపుకు వెళ్లిన అజయ్ పై రెండు బైకులు, ఓ కారులో వచ్చిన దుండుగులు తూటాల వర్షం కురిపించారు. విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో తీవ్రగాయాలపాలైన ఆ యువ పాత్రికేయుడు చికిత్స పొందుతూ మరణించాడు.
అజయ్ లాల్వానీ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు చెబుతుండగా, తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడికి ఎవరితోనూ శత్రుత్వంలేదని అంటున్నారు. అజయ్ హత్యను హిందూ ప్రజాప్రతినిధి లాల్ చంద్ హల్హీ ఖండించారు. ఈ ఘటన తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. అటు, పాత్రికేయ సంఘాలు కూడా అజయ్ హత్యపై తీవ్రంగా స్పందించాయి. పాత్రికేయులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు.