Asghar Afghan: ధోనీ రికార్డును అధిగమించిన ఆఫ్ఘనిస్థాన్ సారథి

Afghanistan captain Asghar Afghan breaks Dhoni record by maximum wins as skipper
  • కెప్టెన్ గా అంతర్జాతీయ టీ20ల్లో ధోనీకి 41 విజయాలు
  • ఇప్పుడా రికార్డును తిరగరాసిన అస్ఘర్ ఆఫ్ఘన్
  • 42 విజయాలతో కొత్త రికార్డు
  • జింబాబ్వేతో రెండో టీ20లో విజయంతో విశిష్ట ఘనత
టీమిండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ భారత్ తరఫున విశేష స్థాయిలో విజయాలు సాధించి అనేక రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. టీ20 పోటీల్లో కెప్టెన్ గా 41 విజయాలు నమోదు చేశాడు. అయితే ఇప్పుడా రికార్డును ఆఫ్ఘనిస్థాన్ సారథి అస్ఘర్ ఆఫ్ఘన్ తిరగరాశాడు. జింబాబ్వేతో రెండో టీ20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఘనవిజయం సాధించగా, ఈ విజయంతో అస్ఘర్ ఆఫ్ఘన్ తన పేరిట ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20 పోటీల్లో కెప్టెన్ గా 42 విజయాలతో ధోనీ రికార్డు (41)ను అధిగమించాడు.

ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో గణనీయమైన స్థాయిలో విజయాలు సాధిస్తూ, క్రమంగా బలమైన జట్టుగా ఎదుగుతోంది. రషీద్ ఖాన్, ముజీబ్, నబి వంటి క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా పలు లీగ్ పోటీల్లో రాణిస్తూ ఆఫ్ఘన్ క్రికెట్ సత్తా చాటుతున్నారు.
Asghar Afghan
MS Dhoni
Most Wins
T20I
Afghanistan

More Telugu News