స్పైస్ జెట్ విమానాలపై సోనూ సూద్ బొమ్మ... 'రక్షకుడు' అంటూ కితాబు
- లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ విశేష సేవలు
- వలస కూలీల పాలిట దేవుడిలా సోనూ
- బస్సులు ఏర్పాటు చేసి కూలీల తరలింపు
- విదేశాల్లో చిక్కుకున్న వారి కోసం ప్రత్యేక విమానాలు
- సోనూ సేవలను గుర్తించిన స్పైస్ జెట్
- రక్షకుడికి శాల్యూట్ అంటూ సముచిత గౌరవం
లాక్ డౌన్ సమయంలో వలసకూలీల వెతలపై తీవ్రంగా స్పందించిన సోనూ సూద్ వారికోసం పెద్ద సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు తరలించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం విమానాలు పంపి స్వదేశానికి రప్పించారు. అడిగిన వారికి కాదనకుండా సాయం చేసి అపర కర్ణుడే అయ్యారు.