USA: పట్టుదప్పి పడిపోయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్​.. ఇదిగో వీడియో

US President Joe Biden stumbles thrice trying to board Air Force One
  • విమానం ఎక్కుతుండగా ఘటన
  • గాలుల వల్లేనన్న వైట్ హౌస్
  • ఆయనకు ఏం కాలేదని ప్రకటన
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పట్టుదప్పారు. అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కుతుండగా మెట్లపై పడ్డారు. రెండు మూడు సార్లు అలాగే జరిగింది. ఏషియన్ అమెరికన్లపై జరుగుతున్న దాడులపై చర్చించేందుకు, వారికి భరోసానిచ్చేందుకు శుక్రవారం ఆయన అట్లాంటా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది.


దీనిపై శ్వేత సౌధం స్పందించింది. బయట గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్లే ఆయన ఒరిగారని వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కెరీన్ జీన్ పియర్ విలేకరులకు చెప్పారు. తాను కూడా మెట్లు ఎక్కుతూ పడిపోబోయానన్నారు. బైడెన్ కు ఏమీ కాలేదని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు.
USA
Joe Biden
Air Force One

More Telugu News