Nara Lokesh: కోర్టులో చీవాట్లు తిని పారిపోవడం మీకు అలవాటేగా!: సీఎం జగన్ ను ఎద్దేవా చేసిన లోకేశ్

Lokesh comments on CM Jagan after High Court stays CID investigation
  • చంద్రబాబుకు సీఐడీ నోటీసులు
  • హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
  • విచారణ నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చిన న్యాయస్థానం
  • నీ బాబు వల్లే కాలేదు నువ్వెంత అంటూ జగన్ పై లోకేశ్ వ్యాఖ్యలు
చంద్రబాబుపై సీఐడీ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ... నీ బాబు వల్లే కాలేదు, నువ్వెంత? అని వ్యాఖ్యానించారు చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం, కోర్టులో చీవాట్లు తిని తోకముడిచి పారిపోవడం మీ కుటుంబానికి అలవాటేగా అని ఎద్దేవా చేశారు.

అంతేకాదు, ఓ చానల్ లో వచ్చిన వీడియో కథనాన్ని కూడా పంచుకున్నారు. చంద్రబాబుపై నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నమోదైన కేసుల నుంచి తాజాగా నమోదైన కేసుల వరకు ఆ వీడియోలో వివరించారు. 'సింహ ఎప్పటికీ గడ్డి తినదు, చంద్రబాబు ఎన్నటికి అవినీతికి పాల్పడరు' అని ఆ వీడియోలో ముక్తాయించారు.
Nara Lokesh
Jagan
Chandrababu
CID
Insider Trading
Amaravati

More Telugu News