Varla Ramaiah: జగన్ కు ఏమాత్రం నైతిక విలువలున్నా చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: వర్ల రామయ్య

Varla Ramaiah demands apologies from CM Jagan to Chandrababu
  • అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు
  • హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
  • 4 వారాలపాటు వర్తించేలా స్టే ఇచ్చిన హైకోర్టు
  • జగన్ పై ధ్వజమెత్తిన వర్ల రామయ్య
  • జగన్ ఆత్రుత సరైంది కాదని కోర్టు తేటతెల్లం చేసిందని వ్యాఖ్యలు
అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఐడీ విచారణపై హైకోర్టు నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. జగన్ కు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా చంద్రబాబును క్షమాపణలు కోరాలని, భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టబోనని చెప్పాలని అన్నారు. ఏదేమైనా, సీఎం జగన్ కు తొందరపాటు తగదని హైకోర్టు తీర్పు స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఫిర్యాదులు చేయడం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అలవాటేనని వర్ల రామయ్య విమర్శించారు.

కాగా, ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ... చంద్రబాబుకు నోటీసులు పంపింది. ఈ నెల 23న విజయవాడలో విచారణకు రావాలని స్పష్టం చేసింది. సీఐడీ నోటీసులపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం నాలుగు వారాలు స్టే ఇచ్చింది. అప్పటివరకు సీఐడీ విచారణను నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది.
Varla Ramaiah
Jagan
Chandrababu
Apology
Stay
AP High Court
CID
Insider Trading
Amaravati

More Telugu News