Salman Khan: వైరల్‌గా మారిన కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఫొటో ఇదిగో!

Bollywood star salman Khan viral pic
  • వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న బాలీవుడ్‌ స్టార్‌
  • సమయం దొరికితే షికారుకు వెళుతున్న సల్మాన్‌
  • మే 13న ప్రేక్షకుల ముందుకు రానున్న రాధే
  • షారుఖ్‌ చిత్రంలో ప్రత్యేక పాత్రలో
బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ వరుస షూటింగ్‌లతో ఈ ఏడాది తీరిక లేకుండా గడుపుతున్నాడు. అయితే, సమయం దొరికినప్పుడల్లా కాస్త బ్రేక్‌ తీసుకొని రీఫ్రెష్‌ అవుతున్నాడు. కుటుంబ సభ్యులు, మిత్రులతో సరదాగా బయటకు వెళుతున్నాడు.

ఈ క్రమంలో ఇటీవల ఆయన రాజస్థాన్‌లో ఓ అడవిలో తిరుగుతూ ఉన్న ఓ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో ఆయనతో పాటు ఆయన బాడీగార్డ్‌ షేరా, రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రముఖ నటి బీనా కూడా ఉన్నారు. సల్మాన్‌ గురువారం జైపుర్‌లో తిరగడం కూడా కెమెరా కంటికి చిక్కింది. షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్న ఖాన్‌ అప్పుడప్పుడు సరదాగా బయటకు వస్తూ రీఫ్రెస్‌ అవుతున్నాడు.

ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ‘రాధే’ మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో దిశా పటానీ, రణ్‌దీప్‌ హూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు త్వరలో టైగర్-3 చిత్రం షూటింగ్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌ కథానాయికగా నటించనుంది. వీటితో పాటు షారూఖ్‌ ఖాన్‌, దీపికా పదుకుణె, జాన్‌ అబ్రహాం కలిసి నటిస్తున్న సిద్ధార్థ్‌ ఆనంద్‌ చిత్రం పఠాన్‌లోనూ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

Salman Khan
Rajasthan
Radhe
Bollywood

More Telugu News