Rang De: ఇది వినోదాల హరివిల్లు... 'రంగ్ దే' ట్రైలర్ ను పంచుకున్న నితిన్

Here it is Nithin starred Rang De trailer
  • నితిన్, కీర్తి సురేశ్ జంటగా 'రంగ్ దే'
  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో లవ్ ఎంటర్టయినర్
  • సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్లో చిత్రం
  • ఇప్పటికే హిట్టయిన పాటలు
  • ట్రైలర్ ను సోషల్ మీడియాలో పంచుకున్న నితిన్
నితిన్, కీర్తి సురేశ్ జంటగా వస్తున్న చిత్రం 'రంగ్ దే'. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ వీడియోను హీరో నితిన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదిగోండి వినోదాల హరివిల్లు అంటూ వ్యాఖ్యానించారు. 'రంగ్ దే' చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోందని వెల్లడించారు.

ఇక ట్రైలర్ చూస్తే పూర్తిగా వినోదాత్మక చిత్రం అని తెలుస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరి కామెడీ, లవ్ నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టయినర్ గా తెరకెక్కించారు. సితార ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేవి శ్రీప్రసాద్ బాణీలు 'రంగ్ దే'కు మరింత వన్నెలద్దాయి.
Rang De
Trailer
Keerthy Suresh
Venky Atluri
Tollywood

More Telugu News