Renu Desai: చర్చిలు, దేవాలయాలపై రేణు దేశాయ్ కామెంట్స్!

  • చర్చిలు, మసీదులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయి
  • దేవాలయాలు మాత్రం ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి
  • ఇది లౌకిక దేశం ఎలా అవుతుంది?
Renu Desai  comments on Temples and Mosjids

సినీ నటి రేణు దేశాయ్ సమాజంలో జరిగే అనేక విషయాలపై తన స్పందనను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు. అనేక విషయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతుంటారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆ ఇంటర్వ్యూకి చెందిన ప్రోమో బయటకు వచ్చింది. అందులో ఆమె మాట్లాడుతూ, 'మన దేశంలో మసీదులు, చర్చిలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటాయి. దేవాలయాలు మాత్రం ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. అలాంటప్పుడు భారత్ లౌకిక దేశం ఎలా అవుతుంది? మసీదులు, చర్చిలను ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలని నేను చెప్పడం లేదు. కానీ దేవాలయాలను కూడా ప్రభుత్వ అధీనం నుంచి తప్పించవచ్చు కదా' అని వ్యాఖ్యానించారు.

More Telugu News