Arun Govil: బీజేపీలో చేరిన బుల్లితెర రాముడు అరుణ్ గోవిల్

  • 1987లో టీవీలో ప్రసారమైన ‘రామాయణ్’
  • రాముడిగా చిరపరిచితుడైన అరుణ్ గోవిల్
  • పశ్చిమ బెంగాల్‌లో విస్తృత ప్రచారానికి రెడీ
Arun Govil joins BJP

1980 దశకం చివరిలో టీవీలో ప్రసారమైన ‘రామాయణ్’ ధారావాహిక ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అందులో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ఆ పాత్రలో ఒదిగిపోయారు. నిజానికి ఆ సీరియల్‌ అంత పాప్యులర్ కావడానికి ఆయన నటన కూడా ఓ కారణం. ఆ తర్వాత ఆయన హిందీ, భోజ్‌పురి, ఒడియా, తెలుగు సినిమాల్లోనూ నటించారు. ముఖ్యంగా పౌరాణిక సినిమాల్లో ఎక్కువగా కనిపించారు. టీవీ రాముడిగా పేరుగాంచిన ఆయన తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

ఢిల్లీలో నిన్న బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తారని సమాచారం. పశ్చిమ బెంగాల్‌లో ‘జైశ్రీరామ్’ అనేది బీజేపీ ఎన్నికల నినాదంగా మారింది. ఇది తమకు అధికారాన్ని కట్టబెడుతుందని భావిస్తోంది. 2019 ఎన్నికల్లోనూ బీజేపీ అక్కడ ఇదే మంత్రాన్ని జపించి 42 లోక్‌సభ స్థానాలకు గాను 18 గెలుచుకుంది.

More Telugu News