Team New Zealand: నిరాశపరిచిన కోహ్లీ, రోహిత్.. జట్టును ఆదుకున్న సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్

India puts 186 runs target for England in fourth T20
షార్ట్స్‌లో చూడండి
అహ్మదాబాద్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

భారత జట్టులో రోహిత్ శర్మ, కోహ్లీ వంటి స్టార్లు నిరాశ పరిచినా సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ జట్టుకు భారీ స్కోరును అందించారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇద్దరూ ఇన్నింగ్స్ ను ఆరంభించారు. భారత బ్యాట్స్ మెన్ లో రోహిత్ శర్మ 12 పరుగులు, కేఎల్ రాహుల్ 14, సూర్యకుమార్ యాదవ్ 57, విరాట్ కోహ్లీ 1, రిషభ్ పంత్ 30, శ్రేయస్ అయ్యర్ 37, హార్దిక్ పాండ్యా 11, శార్దూల్ ఠాకూర్ 10, వాషింగ్టన్ సుందర్ 4 పరుగులు చేశారు. భువనేశ్వర్ కుమార్ పరుగులేమీ చేయకుండా నాటౌట్ గా నిలిచాడు.  

మరోవైపు 186 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆచితూచి ఆడుతోంది. జేసన్ రాయ్, బట్లర్ ఇద్దరూ చెరొక పరుగుతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 2 పరుగులు.
Go Back to Shorts
Team New Zealand
England
T20
Score

More Telugu News