Sensex: కరోనా ఎఫెక్ట్.. కుప్పకూలిన మార్కెట్లు!

  • మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
  • 585 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 163 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Stock markets collapses amid raise of corona cases

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాలను చవిచూశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే పయనించాయి. అయితే మధ్యాహ్నం తర్వాత లాభాలు మొత్తం హరించుకుపోయాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. తమ షేర్లను అమ్ముకునేందుకు మొగ్గు చూపారు.

దీంతో ఈరోజు ఒకానొక సమయంలో దాదాపు 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్... ఆ తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 585 పాయింట్లు కోల్పోయి 49,216కి పడిపోయింది. నిఫ్టీ 163 పాయింట్లు నష్టపోయి 14,557కి దిగజారింది. టెలికాం, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సూచీలు మినహా అన్ని సూచీలు నష్టాలను చవి చూశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (3.25%), బజాజ్ ఆటో (2.46%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.03%), భారతి ఎయిర్ టెల్ (0.60%), ఓఎన్జీసీ (0.55%).

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.97%), ఇన్ఫోసిస్ (-3.67%), డాక్టర్ రెడ్డీసీ లేబొరేటరీస్ (-3.34%), టీసీఎస్ (-2.44%), టెక్ మహీంద్రా (-2.36%).

More Telugu News