Alla Ramakrishna Reddy: సీఐడీ విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

YSRCP MLA  Alla Ramakrishna Reddy attends CID enquiry
  • అమరావతి భూముల విషయంలో ఆళ్ల ఫిర్యాదు
  • కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ
  • డీఎస్పీ సూర్యభాస్కర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణ
అమరావతి అసైన్డ్ భూముల క్రయవిక్రయాల కేసులో ఏపీ సీఐడీ విచారణకు వైసీపీ ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ భూముల వ్యవహారంలో చంద్రబాబు అండ్ కో అవకతవకలకు పాల్పడ్డారని ఆయన సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని సీఐడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో, ఈరోజు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి ఆయన హాజరయ్యారు.

సీఐడీ డీఎస్పీ సూర్యభాస్కర్ ఆధ్వర్యంలో ఈ కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోంది. రైతుల స్టేట్ మెంటును కూడా త్వరలోనే సీఐడీ రికార్డు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేశారు. కేసులో ఏ1గా చంద్రబాబును, ఏ2గా నారాయణను పేర్కొన్నారు. ఈనెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Alla Ramakrishna Reddy
YSRCP
Amaravati Lands
CID
Chandrababu

More Telugu News