Harish Rao: మరికాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు

Minister Harish Rao will soon introduce the budget in the Telangana Assembly
  • జూబ్లీహిల్స్‌, వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
  • హామీలు నెరవేర్చేలా బడ్జెట్‌ను రూపొందించామన్న మంత్రి
  • హరీశ్‌కు పలువురు మంత్రుల శుభాకాంక్షలు
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మరికాసేపట్లో అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్‌ను రూపొందించినట్టు చెప్పారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి జరుగుతుందని అన్నారు.

స్వామి వారిని దర్శించుకున్న అనంతరం హరీశ్‌రావు అసెంబ్లీకి చేరుకున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న హరీశ్‌కు పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని హరీశ్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు.
Harish Rao
Telangana
Budget

More Telugu News