సాంకేతిక లోపం.. రివర్స్ లో 35 కిలోమీటర్లు వెళ్లిన రైలు.. వీడియో ఇదిగో
- ఢిల్లీ నుంచి బయలుదేరిన పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్
- ఉత్తరాఖండ్‌లో ట్రాక్ పైకి పశువులు
- లోకోపైలట్ సడెన్ బ్రేక్ వేయడంతో సమస్య
ఉన్నట్టుండి రైలు వెనక్కి వెళ్లడం ప్రారంభించి, అలాగే 35 కిలోమీటర్లు వెళ్లి ఖాతిమా దగ్గర నిలిచిపోయింది. ఆ సమయంలో అది చాలా వేగంగా వెళ్లింది. ఇంజిన్‌పై లోకోపైలట్ నియంత్రణ కోల్పోవడంతో ఏమీ చేయలేకపోయాడు. రైలు ఆగిన అనంతరం ప్రయాణికులను కిందికి దించి ఖాతిమా నుంచి బస్సుల ద్వారా తనక్‌పూర్‌కు పంపారు. ఆ రైలు నడిపిన లోకోపైలట్, గార్డ్‌లపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.