Actress Radhika: ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. కమలహాసన్‌కు పట్టం కడతారు: నటి రాధిక

Kamal Haasan would be the chief minister of Tamil Nadu
  • మాది బలమైన కూటమి
  • విద్యావంతులు, మేధావులు మార్పు కోసం చూస్తున్నారు
  • గెలిపిస్తే పాలనలో మార్పు తీసుకొచ్చి చూపిస్తాం
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో గెలిచి కమల హాసన్ ముఖ్యమంత్రి అవుతారని సీనియర్ నటి, ఎస్ఎంకే నేత రాధిక అన్నారు. తమిళ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఈసారి కమల్‌కు అవకాశం ఇస్తారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఇండియా జననాయక కట్చి, మక్కల్ నీది మయ్యం, సమత్తువ మక్కల్ కట్చిలు కూటమి ఏర్పడి బరిలోకి దిగాయి. తమది బలమైన కూటమి అని రాధిక పేర్కొన్నారు.

విద్యావంతులు, మేధావులు మార్పును కోరుకుంటున్నారని, ఇది చాలా అరుదైన ప్రగతిశీల ఆలోచన అని అన్నారు. గుడ్ గవర్నెన్స్ కోసం తమకు ఓటేస్తే పరిపాలనలో మార్పు తీసుకొచ్చి చూపిస్తామని రాధిక హామీ ఇచ్చారు. కూటమి పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోలు చూస్తే సుపరిపాలనకు, వాస్తవికతకు ఎంత దగ్గరగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు. మార్పు కోరుకుంటున్న ప్రజలు ఈసారి కమల్‌కు అవకాశం ఇస్తారని గట్టిగా నమ్ముతున్నట్టు రాధిక అన్నారు.
Actress Radhika
Tamil Nadu
Kamal Haasan
Elections

More Telugu News