Khammam: ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. దూసుకెళ్తున్న పల్లా

TRS Sitting MLC Palla Rajeshwar Reddy Ahead in MLC Elections
  • తొలి రౌండ్ ఫలితాల వెల్లడి
  • రెండు, మూడు స్థానాల్లో తీన్మార్ మల్లన్న, కోదండరాం
  • కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి దూసుకెళ్తున్నారు. ఇక్కడ మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3,85,996 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఏడు రౌండ్లలో ఓట్లను లెక్కిస్తుండగా, ఒక్కో రౌండ్‌లో 56 వేల ఓట్ల చొప్పున లెక్కించనున్నారు.

తొలి రౌండ్ ఫలితాలు విడుదలైన తర్వాత 16,130 ఓట్లతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి  తన సమీప ప్రత్యర్థుల కంటే ముందున్నారు. 12,046 ఓట్లతో తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో ఉండగా, టీజేఎస్ నేత కోదండరాం 9,080 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.

బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి (6,615), కాంగ్రెస్ నేత రాములు నాయక్ (4,354), రాణి రుద్రమరెడ్డి (1,123), చెరుకు సుధాకర్ (1,077) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Khammam
Warangal
Nalgonda
MLC
Result

More Telugu News