బుమ్రా పెళ్లిపై త‌ప్పుగా ట్వీట్ చేసి ట్రోలింగ్ బారిన ప‌డ్డ మ‌యాంక్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బుమ్రా పెళ్లిపై త‌ప్పుగా ట్వీట్ చేసి ట్రోలింగ్ బారిన ప‌డ్డ మ‌యాంక్!

mayank gets trolled
  • స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌తో బుమ్రా వివాహం
  • శుభాకాంక్ష‌లు చెబుతూ మ‌యాంక్ ట్వీట్
  • సంజనా గణేశన్‌కి బ‌దులుగా సంజయ్‌ బంగర్‌ పేరును ట్యాగ్‌
టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వివాహం నిన్న జ‌రిగిన విష‌యం విదిత‌మే. స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌తో బుమ్రా వివాహం జ‌ర‌గ‌గా వారికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ప‌లువురు క్రికెట‌ర్లు ట్వీట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో మయాంక్‌ అగర్వాల్ ట్వీట్ చేస్తూ ‌పొరపాటున సంజనా గ‌ణేశన్‌కు బదులుగా టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్‌ బంగర్‌ పేరును ట్యాగ్‌ చేశాడు.

దీంతో,  బుమ్రా, సంజయ్‌ బంగర్ వైవాహిక జీవితం బాగుండాలని కోరుకుంటున్నాన‌ని బుమ్రా పేర్కొన్న‌ట్లు అది క‌న‌ప‌డుతోంది. ఈ విష‌యాన్ని గుర్తించిన నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. బుమ్రా భార్య పేరు సంజయ్‌ బంగర్‌ కాదని,  సంజనా గణేశన్ అని కామెంట్లు చేస్తున్నారు. త‌న ట్వీట్లో చేసిన పొర‌పాటును గుర్తించిన మ‌యాంక్ చివ‌ర‌కు తన ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు. అయితే, అప్ప‌టికే ఆ ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసుకున్న నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.
mayank
bumra
Cricket
Twitter

More Telugu News