భైంసాలో అరెస్ట్ చేసిన హిందువులను వెంటనే విడుదల చేయాలి: గవర్నర్ కు బండి సంజయ్ వినతిపత్రం

15-03-2021 Mon 19:30
  • ఇటీవల భైంసాలో హింస
  • హిందువులను అరెస్ట్ చేశారన్న బండి సంజయ్
  • రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు
  • విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వినతి
Bandi Sanjay wants release of Hindus arrested in Bhainsa
ఇటీవల నిర్మల్ జిల్లా భైంసాలో అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో హిందువులను పోలీసులు అరెస్ట్ చేశారంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన హిందువులను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వినతిపత్రం సమర్పించారు. హిందువులను విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గవర్నర్ ను కోరారు. దీనిపై బండి సంజయ్ ట్విట్టర్ లో వెల్లడించారు.

భైంసాలో హిందువులపై జరుగుతున్న దాడులు, రాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా బండి సంజయ్ తో పాటు గవర్నర్ ను కలిసినవారిలో ఎన్.రామచందర్ రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, దుగ్యాల ప్రదీప్ కుమార్, శ్రీ ప్రకాశ్ రెడ్డి, ఎస్.కుమార్, సంగప్ప తదితరులున్నారు.