TDP: చంద్రబాబు, పవన్ లపై రోజా సెటైర్లు ‌

Roja Fires On Chandrababu and pawan kalyan
  • తెదేపా, జనసేనపై నగరి ఎమ్మెల్యే ఘాటు విమర్శలు
  • చంద్రబాబు మనవడితో ఆడుకోవాలంటూ ఎద్దేవా
  • పవన్‌కు జెండా, ఎజెండా లేదని విమర్శ
  • రెబల్స్‌కు విజయంతోనే సమాధానం చెప్పామన్న రోజా
వైసీపీకి చెందిన నగరి ఎమ్మెల్యే రోజా ఇటు తెదేపాతో పాటు జనసేనపై తీవ్ర విమర్శలు చేశారు. తెదేపాను ఓఎల్‌ఎక్స్‌లో పెట్టుకుంటే మంచిదంటూ ఎద్దేవా చేశారు.  అలాగే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీరు వానపాము లేచి నాగుపాముపై బుసకొట్టినట్లు ఉందన్నారు. పవన్‌కు అసలు జెండా, అజెండానే లేవని ఘాటుగా విమర్శించారు. ఇక తమ సొంత పార్టీలోని రెబల్స్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని.. విజయంతోనే వారికి సమాధానం చెప్పామన్నారు.

తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మనవడితో ఆడుకుంటూ శేషజీవితం గడపాలంటూ రోజా ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న వైసీపీ ఇక తెదేపాను పూర్తిగా అణచివేసినట్లేనని వ్యాఖ్యానించారు. 18 నెలల పాలనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల హృదయాల్ని కొల్లగొట్టారని తెలిపారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు వైకాపా విజయకేతనం ఎగురవేసి తెదేపాను తరిమికొట్టిందని వ్యాఖ్యానించారు.

ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తాయని పవన్‌, చంద్రబాబుకు ముందే తెలుసని.. అందుకే వారు లెక్కింపు రోజు హైదరాబాద్‌లోనే విశ్రాంతి తీసుకున్నారని రోజా విమర్శించారు. పవన్‌ ఒక్కోచోట ఒక్కో పార్టీ అభ్యర్థికి మద్దతిస్తున్నారని.. ఆయనకు ఒక స్పష్టతే లేదని వ్యాఖ్యానించారు.
TDP
YSRCP
AP Politics
Andhra Pradesh
Roja
Pawan Kalyan
Chandrababu

More Telugu News