Faria Abdulla: బిగ్ ఆఫర్ కొట్టిన 'జాతిరత్నాలు' కథానాయిక?

Faria Abdulla opposite Raviteja
  • యూత్ ని ఆకట్టుకుంటున్న 'జాతిరత్నాలు'
  • చిత్ర కథానాయిక ఫరియాకు పలు ఆఫర్లు
  • తదుపరి చిత్రానికి సిఫార్సు చేసిన రవితేజ 
  • త్రినాథరావు నక్కిన చిత్రంలో అవకాశం  
ఒక సినిమా హిట్టయితే చాలు.. ఇక అందులో నటించిన హీరోయిన్లను వెతుక్కుంటూ అవకాశాలు వచ్చేస్తాయి. తాజాగా ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లాకు కూడా అలాగే ఛాన్సులు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన 'జాతిరత్నాలు' చిత్రం యూత్ ని బాగా ఆకట్టుకుంటూ సూపర్ హిట్టయింది. మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలో ఇందులో కథానాయికగా నటించిన ఫరియా అబ్దుల్లాకు తాజాగా ప్రముఖ హీరో రవితేజ నటించే సినిమాలో ఆఫర్ వచ్చినట్టు సమాచారం.

ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో కథానాయిక పాత్రకు ఫరియాను బుక్ చేయాల్సిందిగా రవితేజ దర్శక నిర్మాతలకు సూచించాడట. మంచి హైటూ.. అందం.. అభినయం ఉండడంతో ఫరియా తన పక్కన బాగుంటుందని రవితేజ భావిస్తున్నాడట.  దీంతో దర్శక నిర్మాతలు ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదేకాకుండా మరికొన్ని ఆఫర్లు కూడా ఆమెకు వస్తున్నట్టు చెబుతున్నారు.    
Faria Abdulla
Raviteja
Trinatha Rao
Jati Ratnalu

More Telugu News