Srinivasulu Reddy: భవిష్యత్తులో టీడీపీ పుంజుకుంటుంది: టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి

TDP got 44 percent votes in municipal elections says Srinivasulu Reddy
  • నైతిక విజయం టీడీపీదే  
  • పోలింగ్ శాతం తక్కువగా ఎందుకు నమోదైంది?
  • మైదుకూరులో టీడీపీ అభ్యర్థిని బలవంతంగా తీసుకెళ్లారు
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ, నైతిక విజయం టీడీపీదేనని చెప్పారు. భవిష్యత్తులో టీడీపీ పుంజుకుంటుందని చెప్పారు.

నామినేషన్ల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి వైసీపీ నేతల బెదిరింపులు, ప్రలోభాలు, దౌర్జన్యకాండపై అధికారులు సరిగా స్పందించలేదని శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని... నిజంగా ఆ పార్టీ మీద ప్రజలకు అంత అభిమానమే ఉంటే పోలింగ్ శాతం తక్కువగా ఎందుకు నమోదైందని ప్రశ్నించారు. మైదుకూరులోని 6వ వార్డులో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థిని బలవంతంగా తీసుకెళ్లారని చెప్పారు.
Srinivasulu Reddy
Telugudesam
Municipal Elections

More Telugu News