Dhoni: ధోనీ కొత్త అవతారం చూసి షాకవుతున్న అభిమానులు!

Fans shocks after seen Dhoni new avatar
  • బౌద్ధ సన్యాసిలా మారిన ధోనీ
  • ఫొటో పంచుకున్న స్టార్ స్పోర్ట్స్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
  • ఇంటర్నెట్ ను బ్రేక్ చేసే ఫొటో అంటున్న స్టార్ స్పోర్ట్స్
టీమిండియా క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ కొత్త అవతారం చూసి అభిమానులు నివ్వెరపోతున్నారు. ఓ బౌద్ధ సన్యాసిలా దర్శనమిస్తున్న ధోనీ ఫొటోను స్టార్ స్పోర్ట్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ధోనీ ముందర కొందరు బాల శిష్యులు కూర్చుని ఉండడం ఆ ఫొటోలో చూడొచ్చు. ఎప్పుడూ స్పోర్టీ లుక్ తో కనిపించే ధోనీ అకస్మాత్తుగా సన్యాసి వేషంలో కనిపించడమేంటో అర్థంకాక అభిమానులు విస్మయానికి గురవుతున్నారు. ధోనీ కొత్త అవతారం చూసి అందరి ముఖాల్లో ఎలాంటి ఫీలింగ్స్ కనిపిస్తున్నాయో చూడండి... ఇది ఇంటర్నెట్ ను బ్రేక్ చేయడం ఖాయం అని స్టార్ స్పోర్ట్స్ పేర్కొంది.
Dhoni
New Avatar
Monk
Team India
Star Sports

More Telugu News