YSRCP: మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం... పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు

YCP Cadre celebrates massive victories in Municipal Elections
  • వైసీపీకి భారీ విజయాలు కట్టబెట్టిన నగర, పట్టణ ఓటర్లు
  • తాడేపల్లిలో వేడుకలకు హాజరైన సజ్జల, మోపిదేవి
  • జగన్ ను ప్రజలు మరోసారి ఆశీర్వదించారన్న సజ్జల
  • టీడీపీ వెంటిలేటర్ ను పీకేశారని వెల్లడి
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం నేపథ్యంలో తాడేపల్లిలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలకు తెరలేపారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తదితర నేతలు, కార్యకర్తలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. బాణసంచా కాల్చుతూ సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహం ప్రదర్శించారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ... ఈ తరహాలో ఫలితాలను తాము ముందే ఊహించామన్నారు. మున్పిపల్ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాలు అందించడం ద్వారా జగన్ ను ప్రజలు మరోసారి ఆశీర్వదించారని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల కోసం తాము ఎలాంటి మేనిఫెస్టో విడుదల చేయలేదని, జగన్ ప్రచారానికి కూడా రాలేదని, జగన్ అమలు చేస్తున్న పథకాలే వైసీపీని గెలిపించాయని సజ్జల స్పష్టం చేశారు.  ఇప్పటివరకు టీడీపీ వెంటిలేటర్ పై ఉందనుకుంటే... ప్రజలు నేడు అది కూడా పీకేశారని ఎద్దేవా చేశారు.
YSRCP
Municipal Elections
Tadepalli
Jagan
Sajjala Ramakrishna Reddy
Mopidevi Venkataramana
Andhra Pradesh

More Telugu News