Chiranjeevi: మరోసారి అమితాబ్, చిరంజీవి కాంబినేషన్?

Chiranjeevi and Amitab act together again
  • చిరంజీవి, అమితాబ్ ల మధ్య మంచి అనుబంధం 
  • చిరంజీవి 'సైరా'లో ప్రత్యేక పాత్ర పోషించిన అమితాబ్
  • అమితాబ్ హిందీ సినిమాలో చిరంజీవి స్పెషల్ రోల్  
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరికీ ఒకరిపట్ల ఒకరికి ఎంతో గౌరవం. ఆ అనుబంధంతోనే ఆమధ్య తన సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటించాలని చిరంజీవి కోరగానే వెంటనే అమితాబ్ ఒప్పుకున్నారు. అలా ఆయన చిరంజీవి నటించిన 'సైరా' సినిమాలో భాగమయ్యారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలసి నటించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.

అయితే, ఈసారి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న హిందీ సినిమాలో చిరంజీవి నటించనున్నట్టు తెలుస్తోంది. అమితాబ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ హిందీ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర ఉందట. అందులో చిరంజీవి నటిస్తే బాగుంటుందని భావించిన అమితాబ్ ఆయనను అడగడం.. చిరంజీవి వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయాయని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మరి, ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది త్వరలో తెలుస్తుంది.  
Chiranjeevi
Amitabh Bachchan
Saira
Bollywood

More Telugu News