YS Sharmila: పులివెందులకు వెళ్తున్న వైయస్ షర్మిల

YS Sharmila going to Pulivendula
  • సోమవారం పులివెందులకు వెళ్తున్న షర్మిల
  • వివేకా వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించనున్న షర్మిల
  • 2019 మార్చి 16న హత్యకు గురైన వివేకా
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు పనుల్లో క్షణం తీరిక లేకుండా వైయస్ షర్మిల గడుపుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఆమె హైదరాబాదు నుంచి పులివెందులకు వెళ్తున్నారు. తన బాబాయ్, దివంగత వైయస్ వివేకానందరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి వివేకాకు ఆమె నివాళి అర్పించనున్నారు. 2019 మార్చి 16న వివేకా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సంచలనం రేపిన ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. మరోవైపు, వివేకా వర్ధంతి కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వెళ్తున్నారా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.  

YS Sharmila
Pulivendula
YS Vivekananda Reddy

More Telugu News