Ketireddy: ఇంత పనికిమాలిన జిల్లా కలెక్టర్ ను ఎప్పుడూ చూడలేదు: వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

YSRCP MLA Kethireddy fires on District collector
  • ఎంపీలు, ఎమ్మెల్యేలను ఖాతరు చేయడం లేదు
  • ఎవడిని నాశనం చేయడానికి ఈయన పుట్టాడు?
  • కలెక్టర్ గంధం చంద్రుడిపై కేతిరెడ్డి ఫైర్
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కలెక్టర్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదని మండిపడ్డారు. జిల్లాకు మేజిస్ట్రేట్ అయినంత మాత్రాన లెక్కలేకుండా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు.

తన 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పనికిమాలిన కలెక్టర్ ను ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. ఎవడిని నాశనం చేయడానికి గంధం చంద్రుడు పుట్టాడని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నాన్ని కలెక్టర్ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంఓ, మంత్రులకు రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్యెల్యేలను వెధవలను చూసినట్టు చూస్తున్నాడని, చివరకు మంత్రులను కూడా పట్టించుకోవడం లేదని కేతిరెడ్డి దుయ్యబట్టారు.

ఈ జిల్లాలో ఏం పాలన జరుగుతోందో తనకు అర్థం కావడం లేదని అన్నారు. పై నుంచి ఎవరూ దిగిరాలేదని అన్నారు. ఒక పనికిమాలిన కలెక్టర్ వల్ల చిల్లవారిపల్లెలో సంప్రదాయబంద్ధంగా జరగాల్సిన పండుగను జరిపించనందుకు బాధగా ఉందని అన్నారు. గంధం చంద్రుడు ఏం పని చేయడని, పక్కనోళ్లు చేసిన పని క్రెడిట్ ను లాక్కుంటాడని విమర్శించారు. ఇటీవల వచ్చిన 'కిసాన్ అవార్డు' కూడా ఆయన కృషి వల్ల రాలేదని... జాయింట్ కలెక్టర్ కష్టపడితే క్రెడిట్ ఆయన కొట్టేశారని అన్నారు. కలెక్టర్ చేసిన పనికిమాలిన పనుల గురించి చెప్పాలంటే పేజీలు చాలవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Ketireddy
Grandham Chandrudu
YSRCP
Anantapur District
Collector

More Telugu News