ఏపీలో గత 24 గంటల్లో 40,448 కరోనా పరీక్షలు... 175 మందికి పాజిటివ్

AP Corona cases data sheet
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 40 కేసులు
  • కర్నూలు జిల్లాలో నిల్
  • కరోనా నుంచి కోలుకున్న 132 మంది
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 1,268 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వైరస్ ఉద్ధృతి మళ్లీ పెరుగుతోందన్న నేపథ్యంలో మరోసారి 100కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 40,448 కరోనా పరీక్షలు నిర్వహించగా 175 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 40 కొత్త కేసులు వెల్లడి కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 31 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 24, విశాఖ జిల్లాలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 132 మంది కరోనా ప్రభావం నుంచి కోలుకోగా, అనంతపురం జిల్లాలో ఒకరు, చిత్తూరు జిల్లాలో మరొకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,563కి చేరుకోగా... 8,83,113 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,268 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,182కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Data Sheet
Positive Cases

More Telugu News