యాదాద్రి జిల్లా ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో 90 మంది

  • యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణ్‌పూర్‌లో ఘటన
  • ఏడుగురు నిర్వాహకుల అరెస్ట్
  • గంజాయి, మద్యం సీసాలు స్వాధీనం
Rave party busted in yadadri dist

యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణ్‌పూర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అందులో పాల్గొన్న మొత్తం 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 400 గ్రాముల గంజాయి, 3 ఎల్ఎన్‌డీ ప్యాకెట్లు, 120 మద్యం సీసాలు, 15 కార్లు, 30 ద్విచక్రవాహనాలు, 3 ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. నిందితులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

More Telugu News