Team India: ఇంగ్లండ్ తో తొలి టీ20లో టీమిండియా ఓటమి

Team India lost first match against England
  • అహ్మదాబాద్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • 8 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్
  • రాణించిన జాసన్ రాయ్
  • 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన మోర్గాన్ సేన
ఇంగ్లండ్ తో అహ్మదాబాద్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. భారత్ విసిరిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ జాసన్ రాయ్ 49 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ 28, డేవిడ్ మలాన్ 24, జానీ బెయిర్ స్టో 26 పరుగులు నమోదు చేశారు.

రాయ్, బట్లర్ అవుటైనా, మలాన్, బెయిర్ స్టో మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో చాహల్, సుందర్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులు చేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే మైదానంలో మార్చి 14న జరగనుంది.
Team India
England
1st T20
Ahmedabad

More Telugu News