ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ లను మించిపోయిన అదాని

12-03-2021 Fri 19:53
  • 2021లో అత్యధిక సంపాదన అదానీదే
  • 16 బిలియన్ డాలర్లతో నెంబర్ వన్ స్థానం
  • 50 బిలియన్ డాలర్లకు చేరిన అదాని సంపద
  • ఈ ఏడాది 8.1 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకున్న ముఖేశ్ అంబానీ
Adani gains ahead of Musk and Bezos
ప్రపంచంలో ఈ ఏడాది అత్యధికంగా ఆర్జించిన కుబేరుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదాని 2021లో అత్యధికంగా సంపాదించిన వారిలో నెంబర్ వన్ గా నిలిచారు. అదాని సంపద ఓ ఉప్పెనలా ఎగిసిందని బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.

అదాని ఈ సంపద ఈ ఏడాది 16.2 బిలియన్ డాలర్ల పెరుగుదలతో నికర సంపద రూ.50 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ క్రమంలో అదాని ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్ (టెస్లా), జెఫ్ బెజోస్ (అమెజాన్)లను కూడా వెనక్కి నెట్టారు. భారత్ లో తన ప్రధాన ప్రత్యర్థి ముఖేశ్ అంబానీని కూడా ఆయన అధిగమించారు. 2021లో ముఖేశ్ ఇప్పటివరకు 8.1 బిలియన్ డాలర్లు మాత్రమే ఆర్జించారని బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది.

పోర్టులు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, బొగ్గు గనులు తదితర రంగాల్లో అదాని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.