Kruti Shetty: మహేశ్ బాబు తదుపరి సినిమాలో కృతిశెట్టి?

Kruti Shetty opposite Mahesh Babu in his next
  • 'ఉప్పెన'తో పరిచయమైన కృతిశెట్టి 
  • నాని, రామ్ సినిమాలలో ఆఫర్లు 
  • అనిల్ రావిపూడి తో మహేశ్ సినిమా
  • కృతిశెట్టికి దక్కనున్న ఛాన్స్   
ఇటీవల విడుదలైన 'ఉప్పెన' సినిమా మరో అందమైన కథానాయికను తెలుగుతెరకు పరిచయం చేసింది. తనే కృతి శెట్టి! ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆమెకు పలు ఆఫర్లు వస్తున్నాయి. అసలీ సినిమా విడుదల కాకుండానే నాని సరసన 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో తాను బుక్కయింది. విడుదలయ్యాక రామ్ సరసన ఇంకో సినిమాలో కథానాయికగా ఎంపికైంది. త్వరలోనే మహేశ్ బాబు సరసన కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్న మహేశ్.. దాని తర్వాత వాస్తవానికి రాజమౌళి దర్శకత్వంలో నటించాలి. అయితే, ఆ ప్రాజక్టుకు ఇంకా సమయం ఉన్నందున ఈ లోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ కూడా ఇటీవల సూచాయగా చెప్పాడు. ఇక ఇందులో కథానాయికగా కృతి శెట్టిని తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడట. నిజంగానే ఇది కార్యరూపం దాలిస్తే కనుక, కృతి శెట్టి కెరీర్ తెలుగులో మరింత పుంజుకుంటుందనే చెప్పచ్చు!
Kruti Shetty
Mahesh Babu
Anil Ravipudi
Uppena

More Telugu News