Samantha: ఈశా వేడుకల్లో సమంతతో డ్యాన్స్ చేయించిన సద్గురు

Sadguru asks Samantha to dance
  • శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఈశా ఫౌండేషన్
  • వేడుకలకు హాజరైన సినీ సెలబ్రిటీలు
  • స్టేజ్ దిగి వచ్చి సమంతను డ్యాన్స్ చేయాలని కోరిన సద్గురు
శివరాత్రి మహోత్సవాలను ఈశా ఫౌండేషన్ ఘనంగా నిర్వహించింది. కోయంబత్తూరులోని ఈశా సెంటర్ లో ఈ ఉత్సవాలకు అక్కనేని సమంతి వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా తెలుగు సినీ గాయని మంగ్లీ పాడిన పాటలకు ఆమె కాలు కదిపారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నవేశం చోటుచేసుకుంది.

మంగ్లీ పాట పాడుతుంటే సద్గురు జగ్గీ వాసుదేవ్ డ్యాన్స్ చేశారు. తాను డ్యాన్స్ చేస్తూ, అక్కడకు విచ్చేసిన అందరినీ ఉత్సాహపరిచారు. స్టేజ్ దిగి సమంత వద్దకు వెళ్లారు. డ్యాన్స్ చేయాలని ఆమెను కోరారు. అయితే, ఆమె నవ్వుతూ అలాగే ఉండిపోయారు. దీంతో, సమంత చేతిని ఈయన చిన్నగా గిల్లారు. ఆ తర్వాత ఆయన సూచన మేరకు అక్కడున్న వారితో కలిసి ఆమె డ్యాన్స్ చేశారు. సద్గురుకు ఎంతోమంది సెలబ్రిటీలు ఫాలోయర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. వారిలో సమంత కూడా ఒక్కరు.
Samantha
Sadguru
Tollywood
Esha Foundation

More Telugu News