Prabhas: 'ఆదిపురుష్' సెట్స్ పై కృతి సనన్, సన్నీ సింగ్... స్వాగతం పలికిన ప్రభాస్

Prabhas welcomes Kriti Sanan and Sunny Singh on Adipurush sets
  • ప్రభాస్ హీరోగా 'ఆదిపురుష్'
  • ఓమ్ రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం
  • చిత్ర యూనిట్ నుంచి తాజా అప్ డేట్
  • 'ఆదిపురుష్' లో కృతి సనన్ 
  • సోషల్ మీడియాలో వెల్లడించిన ప్రభాస్
టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. తాజాగా ఈ సినిమా షూటింగులో హీరోయిన్ కృతి సనన్, నటుడు సన్నీ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ మేరకు ప్రభాస్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆదిపురుష్ కుటుంబంలోకి కృతి సనన్, సన్నీ సింగ్ లకు స్వాగతం అంటూ స్పందించారు.

ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకుడు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తుండగా. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నట్టు సమాచారం. అయితే కృతి సనన్ ను తీసుకుంటి ప్రభాస్ సరసన సీత పాత్రకేనా అన్నది తెలియాల్సి ఉంది.

Prabhas
Adipurush
Kriti Sanan
Sunny Singh
Om Raut
Bollywood
Tollywood

More Telugu News