ఉక్కు పోరాటంలో ఎవరినీ నమ్మకండి: కార్మికులకు సినీ నటుడు శివాజీ పిలుపు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
- కార్మిక సంఘాల నిరసనలు
- కార్మికులకు సంఘీభావం ప్రకటించిన నటుడు శివాజీ
- రాజకీయాలకు అతీతంగా అందరూ రావాలని పిలుపు
ఉక్కు పోరాటంలో ఎవరినీ నమ్మవద్దని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సూచించారు. సంస్థను కాపాడుకోవడం ఉద్యోగులుగా మీ బాధ్యత అని స్పష్టం చేశారు. మా ప్రాంతం కోసం మీరేం చేస్తున్నారంటూ నేతలను ఢిల్లీకి పరుగులు తీయించాలని అన్నారు.
తాను అరెస్ట్ లకు భయపడేవాడిని కాదని శివాజీ స్పష్టం చేశారు. తెలంగాణలోనూ తనపై అన్యాయంగా పలు కేసులు పెట్టారని, అలాంటి కేసులేవీ తనను నిలువరించలేవని పేర్కొన్నారు. తాను తప్పేం చేయలేదు కాబట్టే కోర్టు అండగా నిలిచిందన్నారు.