విశాఖ ఉక్కుపై నోరు మూసుకుని ఉండలేం!: మరోసారి స్పందించిన కేటీఆర్
- విశాఖ ఉక్కుపై మరోసారి స్పందించిన కేటీఆర్
- కొందరు నీకెందుకంటున్నారని వెల్లడి
- మేం దేశంలో లేమా అంటూ ఆగ్రహం
- మాకు నోరు లేదా అంటూ తీవ్రంగా స్పందించిన వైనం
"ఇవాళ ఉక్కు పరిశ్రమను అమ్ముతున్నారు. రేపు సింగరేణి, బీహెచ్ఈఎల్ పైనా పడతారు. ఏపీలో సంగతి మాకెందుకని నోరు మూసుకుని కూర్చోలేం. రేపు తెలంగాణకు కష్టం వస్తే మావెంట ఎవరుంటారు? మాకెందుకులే అనే పట్టింపులేని తత్వం మంచిది కాదు. మనం మొదట భారతీయులం... ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఆలోచించాలి" అని వ్యాఖ్యానించారు. తెలంగాణ వికాస సమితి సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మున్ముందు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేటు పరం చేస్తామంటారేమో అని వ్యంగ్యం ప్రదర్శించారు. సింగరేణి, తదితర సంస్థలను ప్రైవేటీకరిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెగేసి చెప్పారు.