భక్తి మార్గంలో శశికళ.. 15 నుంచి ఆధ్యాత్మిక పర్యటన!

  • అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళ
  • ఇటీవలే జైలు నుంచి విడుదల
  • నేడు శివరాత్రి పూజల్లో పాల్గొననున్న జయ నెచ్చెలి
VK Sasikala decided to visit temples and ready for spiritual tour

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయాల నుంచి బయటపడిన ఆమె ఇప్పుడు ఆధ్యాత్మిక జీవనంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఆధ్యాత్మిక పర్యటన చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. నేడు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చెన్నైలోని టి.నగర్‌లో ఉన్న అగస్తీశ్వరాలయంలో జరిగే పూజల్లో శశికళ పాల్గొంటారు. ఈ నెల 15 నుంచి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనకు బయలుదేరుతారని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

More Telugu News