మమతా బెనర్జీపై దాడి.. కోల్ కతాకు పయనం!
- నందిగ్రామ్ పర్యటనలో మమతపై దాడి
- నలుగురు వ్యక్తులు దాడి చేశారన్న మమత
- సెక్యూరిటీ చాలా దారుణంగా ఉందని మండిపాటు
షెడ్యూల్ ప్రకారం కోల్ కతాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిగ్రామ్ లోనే ఈ రాత్రికి ఆమె బస చేయాల్సి ఉంది. అయితే దాడి నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకున్న ఆమె కోల్ కతాకు తిరుగుపయనం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని చెప్పారు. తాను కారు ఎక్కుతుండగా తనను నెట్టేశారని తెలిపారు. ఈ సందర్భంగా గాయపడిన తన కాళ్లను చూపించారు.
తన పర్యటన సందర్భంగా ఒక్క పోలీసు అధికారి కూడా కనిపించలేదని మండిపడ్డారు. సెక్యూరిటీ చాలా దారుణంగా ఉందని అన్నారు. దాడిలో తన కాళ్లకు గాయాలయ్యాయని చెప్పారు. దాడి వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఈ దాడిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని మమత చెప్పారు. ఒక గుడిలో పూజలు నిర్వహించుకుని వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.