మీ వెనక నడిచే లక్షల అడుగులలో నేను కూడా..: సీఎం జగన్‌కు మద్దతుగా యాంకర్ శ్యామల ట్వీట్
- విశాఖ ఉక్కు పరిశ్రమ సంరక్షణ కోసం పోరాడుతున్నారు
- కార్మికులతో సమావేశం, బందుకు మద్దతు ఇచ్చారు
- అఖిలపక్షంతో ప్రధానిని కలవడానికి సమయం కోరారు
- మీ నాయకత్వంలో జరిగే ప్రయత్నం సఫలం కావాలి
'ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు విశాఖ ఉక్కు సంరక్షణ కోసం కార్మికులతో సమావేశం, బందుకు మద్దతు ఇవ్వడం అఖిలపక్షంతో ప్రధానిని కలవడానికి సమయం కోరడం ద్వారా ఏపీ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలిపినట్లయినది. మీ నాయకత్వంలో జరిగే ప్రయత్నం సఫలం కావాలని ఆశిస్తూ మీ వెనక నడిచే లక్షల అడుగులలో నేను కూడా' అంటూ యాంకర్ శ్యామల ట్వీట్ చేసింది.