AP Municipal Polling: ఏపీలో కొనసాగుతున్న మునిసిపల్ ఎన్నికల పోలింగ్.. విజయవాడలో ఓటేసిన పవన్

Pawan Kalyan Cast his vote in Vijayawada
  • పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
  • పటమటలంకలో ఓటు వేసిన పవన్
  • బరిలో మొత్తం 7,549 మంది అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం  2,214 డివిజన్, వార్డు స్థానాల్లో 580 ఏకగ్రీవం కాగా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే, నాలుగు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 71 మునిసిపాలిటీలు, 12 నగర పాలక సంస్థల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. బరిలో 7,549 మంది అభ్యర్థులు ఉండగా, 77,73,231 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంకలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబరు 4లో పవన్ ఓటు వేశారు. అలాగే, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
AP Municipal Polling
Pawan Kalyan
Vijayawada

More Telugu News