Tirumala: తిరుమలలో కరోనా కలకలం.. 50 మంది వేద విద్యార్థులకు సోకిన మహమ్మారి!

50 Veda Patashala Students Infected to Corona Virus in Tirumala
  • ధర్మగిరి వేద పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు
  • విద్యార్థుల్లో స్వల్ప లక్షణాలను గుర్తించిన అధికారులు
  • స్విమ్స్ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయం
తిరుమలలోని శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో చదువుకుంటున్న వేద విద్యార్థుల్లో దాదాపు 50 మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. వీరంతా కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో స్విమ్స్‌కు తరలించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. వీరికి కరోనా ఎలా సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మిగతా విద్యార్థులను వీరి నుంచి దూరంగా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో టీటీడీ అధికారుల నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
Tirumala
Tirupati
Veda Patashala
Students
Corona Virus

More Telugu News