Annapureddy Venkateswara Reddy: ప్రముఖ సాహితీవేత్త అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి కన్నుమూత

Annapureddy Venkateswara Reddy died in Hyderabad
  • హైదరాబాదులో తుదిశ్వాస విడిచిన అన్నపురెడ్డి
  • రేపు మదీనాగూడలో అంత్యక్రియలు
  • 'మిసిమి' పత్రిక సంపాదకుడిగా విశేష ఖ్యాతి
  • ఫ్రాయిడ్ మనస్తత్వ శాస్త్రాన్ని తెలుగులోకి అనువదించిన అన్నపురెడ్డి
ప్రముఖ సాహితీవేత్త, మిసిమి పత్రిక సంపాదకుడు అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి హైదరాబాదులో కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. అన్నపురెడ్డి వయసు 89 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలు రేపు హైదరాబాదులోని మదీనాగూడలో నిర్వహించనున్నారు.

అన్నపురెడ్డి అధ్యాపకుడిగా పనిచేస్తూనే సాహిత్యంలో విశేషమైన కృషి చేశారు. ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ మనస్తత్వ శాస్త్రాన్ని తెలుగులోకి అనువదించారు. అంతేకాదు, బౌద్ధ సాహిత్యాన్ని తెలుగులో పరిచయం చేశారు. ఆయన మృతి పట్ల రచయితలు, సాహితీ ప్రియులు విచారం వ్యక్తం చేశారు.
Annapureddy Venkateswara Reddy
Demise
Misimi
Editor
Hyderabad

More Telugu News