సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

08-03-2021 Mon 07:30
  • 'ఉప్పెన' భామకు తమిళ సినిమా ఆఫర్
  • ఈ నెల 12న నాగార్జున సినిమా ట్రైలర్  
  • వెంకీ 'దృశ్యం 2'లో పూర్ణ కీలక పాత్ర  
Kruti Shetty bags a film in Tamil

*  'ఉప్పెన' చిత్రం ద్వారా ఒక్కసారిగా క్రేజ్ తెచ్చేసుకున్న కథానాయిక కృతి శెట్టికి పలు ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో తమిళం నుంచి కూడా తాజాగా ఓ ఆఫర్ వచ్చింది. ప్రముఖ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా మురుగదాస్ అసిస్టెంట్ రవికాంత్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కృతి కథానాయికగా ఎంపికైంది.
*  అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న 'వైల్డ్ డాగ్' చిత్రం ట్రైలర్ ను ఈ నెల 12న సాయంత్రం  4.05 గంటలకు విడుదల చేస్తున్నారు. ఇక చిత్రాన్ని ఏప్రిల్ 2న థియేటర్లలో పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు. నూతన దర్శకుడు అహిషోర్ సాల్మన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
*  ఇటీవల మలయాళంలో వచ్చిన 'దృశ్యం 2' చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్, మీనా జంటగా రీమేక్ చేస్తున్న విషయం విదితమే. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ఇక ఇందులో ఓ కీలక పాత్రకు కథానాయిక పూర్ణను ఎంపిక చేసినట్టు సమాచారం.